జోరుమీదున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

జోరుమీదున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

రిలయన్స్‌ జియోలో ఫేస్‌ బుక్‌ వాటాను కొనుగోలు చేయనుందనే వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇవాళ జోరుమీదుంది. ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 10 శాతం లాభపడిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ డే గరిష్ట స్థాయి రూ.1035కు చేరింది. ప్రస్తుతం 8.26శాతం లాభంతో రూ.1021 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12గంటల సమయానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 1.30 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. 

రిలయన్స్‌ జియోలో బహుళ మిలియన్‌ డాలర్ల వాటాను కొనుగోలు చేయాలని అమెరికా టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తోంది. భారత్‌లో వేగంగా విస్తరిస్తోన్న జియో నెట్‌వర్క్‌కు ప్రస్తుతం 370 మిలియన్‌లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం రిలయన్స్‌ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్‌ ప్రభావం అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఇరు సంస్థలు ఒప్పందాన్ని వాయిదా వేసుకున్నాయని సమాచారం.