కరోనా కంటే ముందే మొదలైన డాలర్ సంక్షోభం?

కరోనా కంటే ముందే మొదలైన డాలర్ సంక్షోభం?

కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న తాజా పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 న ఫెడరల్ రిజర్వ్ అత్యంత కీలక ప్రకటన చేసింది - అదే క్యూఇ ఇన్ఫినిటీ. ఎలాంటి అనూహ్యమైన  చర్యలు చేపడుతున్నా, డాలర్ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసే వారందరికీ, ఇండియాతో పాటు విదేశాలలో ఉన్న కేంద్ర బ్యాంకులకు ఇది ఆందోళన కలిగించే విషయంగా చెప్పాలి.

అమెరికాలో ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని... కేవలం కరోనావైరస్ కారణంగానే ఏర్పడిన విషయం కాదు. ఇక్కడ రెండు సంక్షోభాలు ఉన్నాయి. మొదటిది అసాధారణ స్థాయిలో వ్యాపిస్తున్న హెల్త్ ఎమర్జెన్సీ కరోనావైరస్. ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరాలను ఇతర ప్రభావాలను సృష్టించింది. రెండవది అంతర్లీన సంక్షోభం పూర్తిస్థాయిగా రుణ సంక్షోభం. నిజానికి ఇది చాలా కాలంగా ఉంది. 2019 ప్రారంభంలో, కరోనావైరస్ ఇంకా ప్రారంభం కాకముందే కార్పొరేట్ రుణాల కారణంగా డౌన్‌టర్న్‌ ఏర్పడనుందని నిపుణులు సూచించారు.

2020లో కార్పొరేట్ రుణాల కారణంగా ఏర్పడనున్న మాంద్యాన్ని 2019 జనవరిలోనే మూడీసి ఊహించింది! సెప్టెంబరు 2019 లో, ప్రపంచంలోని అతిపెద్ద హెడ్జ్ ఫండ్ అధిపతి రే డాలియో డెట్ బబుల్‌ను 1930 కాలం నాటి మాంద్యంతో పోల్చవచ్చని అన్నారు. మార్చి 2020 నాటికి మార్కెట్లు పతనం అవుతాయంటూ నవంబర్ 2019లోనే 1.5 బిలియన్ డాలర్లు పందెం కాశారు.

అందరూ అప్పుల్లో ఉన్నారు
పౌరుల స్థాయిలో పరిశీలిస్తే, అమెరికన్ గృహ రుణం ఫిబ్రవరి 2020 నాటికి 14 ట్రిలియన్ డాలర్లను దాటింది. క్రెడిట్ కార్డ్ రుణం అసాధారణంగా 46 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరీ ముఖ్యంగా, పెనాల్టీ లోన్స్ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా 20, 30ల వయసులో ఉన్న యువ వినియోగదారులలో ఇది మరీ ఎక్కువగా ఉంది. 2016 లో ఫెడ్ నిర్వహించిన ఒక సర్వేలో 47 శాతం అమెరికన్ కుటుంబాలు సంక్షోభం సమయంలో అదనంగా 400 డాలర్లు కూడా సమీకరించడం కష్టమని తేలింది.

యుఎస్ ప్రభుత్వ రుణ స్థాయిలు 2008నాటి సంక్షోభ స్థాయిలతో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పటి సంక్షోభానికి పూర్వం 2007 లో అమెరికా జాతీయ రుణం 7 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, మార్చి 2020 నాటికి 23.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం ఆర్థిక ప్యాకేజీల కోసం నెలకొన్న గందరగోళంతో..  జాతీయ రుణం 25 ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది అమెరికా కార్పొరేట్ అప్పు. ఈ అంశమే పరిశీలకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ మొత్తం ఏకంగా 10 ట్రిలియన్లు డాలర్లుగా ఉంది. చాలా మంది పరిశీలకులు వ్యవస్థలో అసహాయతను వెల్లడించారు. 2008 సంక్షోభం నుండి పాఠాలు నేర్చుకోవడంలో కార్పొరేట్‌ల వైఫల్యాన్ని విమర్శించారు. స్టాక్ మార్కెట్ రికార్డ్ గరిష్ట సమయంలో, కార్పొరేట్లు తమ లాభాలను చాలావరకు ఉత్పాదక పెట్టుబడులపై దృష్టి పెట్టకుండా వాటాలను తిరిగి కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. ఉదాహరణకు, బోయింగ్ తన ఫ్రీ ఫ్లో క్యాష్ రిజర్వ్స్‌లో 74 శాతం వాటా బైబ్యాక్‌ల కోసం ఖర్చు చేసింది, 60 బిలియన్ డాలర్ల అడిగి బెయిలౌట్ కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో ఇది ఒకటి. దేశంలోని టాప్ 5 విమానయాన సంస్థలు 45 బిలియన్ డాలర్లను షేర్ బైబ్యాక్‌లలో ఖర్చు చేశాయి, ఇవన్నీ బెయిలౌట్‌లకు మొదటి స్థానంలో ఉన్నాయి.

ఈ బెయిలౌట్లు ఆర్థిక వ్యవస్థకు సరైన దిశలో తీసుకు వెళ్తాయనే గ్యారెంటీ లేదు. బెయిలౌట్ల ద్వారా రాజకీయ నాయకులు మూలధన కేటాయింపును మార్కెట్ ప్రక్రియగా నిర్ణయించే పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. బెయిలౌట్ల కోసం నిలిచిన వరుసలో మొదటగా ఔషధ కంపెనీలు, ఆసుపత్రులు ఉన్నాయి. దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని ఇవే ఆపుతాయని కొందరు వాదించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనలో ఈ సంస్థల గురించి అసలు ప్రస్తావనే లేదు. కరోనావైరస్ పుట్టుకకు కారణంగా నిలిచే విమానయాన సంస్థలు, హోటళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

సృష్టించే కొత్త డాలర్లకు పెనాల్టీ కట్టేదెవరు?
తాజా యుఎస్ జిడిపి అంచనాలు -1 శాతం నుండి -24 శాతం వరకు ఉన్నాయి. పెరుగుతున్న పన్ను ఆదాయం లేదా ఖర్చును తిరిగి చెల్లించడానికి వృద్ధి లేనట్లయితే ప్రభుత్వం దాని పునరుద్ధరణకు ఎలా ఆర్థిక సహాయం చేస్తుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం మాదిరిగా అమెరికా ప్రజలు, కార్పొరేషన్లు బకాయిుపడి ఉన్నారు. పెరిగిన పన్నులు బెయిలౌట్‌కు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగపడతాయి, కానీ ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ 2020 ఎన్నికలకు ముందు పన్నులను దూకుడుగా తగ్గిస్తున్నారు. ఆయన చేస్తున్న చర్యల కారణంగా 2017 పన్ను తగ్గింపులు జాతీయ లోటుకు మరో ట్రిలియన్ డాలర్లను జోడిస్తాయని అంచనా. ఇప్పుడు పేరోల్ పన్నులను తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ప్రయోజనాలు, కోతలు రికార్డు స్థాయిలో 2 మిలియన్ల అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన సమయంలో వస్తాయి.

ఇది 2008 కాదని గుర్తుంచుకోవాలి
వడ్డీ రేట్లను సున్నాకి తగ్గించడమే కాకుండా, ఫెడరల్ రిజర్వ్ అపరిమిత ఆస్తి కొనుగోళ్ల ప్రారంభాన్ని ప్రకటించింది. కమర్షియ్ పేపర్స్, టి-బిల్లులు మరియు ఇతర ఆస్తుల కొనుగోలుతో పాటు, కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడానికి ఫెడ్ మొదటిసారిగా ప్రయత్నిస్తోంది. ఇది స్టాక్ మార్కెట్లలో కొన్ని గంటలపాటు ఉపశమనాన్ని ఇచ్చినా, ఇది కూడా ప్రమాదకరమైనది, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న నష్టాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నుండి ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్‌కు బదిలీ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యంతో ఫెడ్ ఖాతాలోకి బ్యాడ్ అసెట్స్ చేరవచ్చు. దీంతో రుణాన్ని క్రెడిట్ లేదా నగదుగా మార్చడంలో ఫెడ్‌ను శాశ్వత రుణ మోనటైజేషన్ ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. దీనివల్ల ఏర్పడిన ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంటుంది. ఇది లోటు నుండి బయటపడటానికి ప్రయత్నించిన జింబాబ్వే, వెనిజులా, వీమర్ రిపబ్లిక్ మాదిరిగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చేయగలదు.

రిజర్వ్ కరెన్సీ స్థితి ఆధారంగా డాలర్‌కు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటే విపత్తు వంటి వాటిని నివారించవచ్చు. 2008 నుండి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. యుఎస్ ఆర్థిక మార్కెట్లలో 2008 సంక్షోభం ప్రారంభమైనప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి ఏకకాలంలో ప్రతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేస్తోంది. చాలా దేశాలు దేశవ్యాప్తంగా షట్‌డౌన్ విధించాయి. అన్ని దేశీయ అంతర్జాతీయ సరఫరా చైన్స్ ప్రభావితం అవుతాయి. అదనంగా, దాదాపు అన్ని ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీలను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్లో డాలర్ల కోసం గందరగోళం నెలకొంది. చాలా మంది ఆర్థికవేత్తలు ఇది ఇంకా బలపడనుందని విశ్వసిస్తున్నారు. అయినా సరే ఈ డిమాండ్‌ను తప్పుగా అర్థం చేసుకోకూడదు - డాలర్స్ బకాయిలను తీర్చడానికి ఇది స్వల్పకాలిక గ్లోబల్ రష్. ఇది కొంతకాలం కొనసాగుతుంది కాని ఎక్కువకాలం ఉండకపోవచ్చు.

డాలర్ గణనీయంగా బలపడటం మరియు ఇతర కరెన్సీలు క్షీణించరడంతో...  కరెన్సీ మార్కెట్లను తాకిన మొదటి ప్రభావాలనే మనం చూస్తున్నాము. డాలర్‌కు రూ.76ను దాటడం జాతీయ స్థాయిలో చాలా ప్రభావాలను సృష్టిస్తోంది. ఆస్ట్రేలియన్ డాలర్ రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయింది. కొరత తీవ్రంగా ఉన్నందున డాలర్ స్వల్పకాలికంలో మాత్రమే పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. ప్రతి దేశం మాంద్యం మరియు ఫైనాన్సింగ్ ఉద్దీపనను ఎదుర్కొంటున్నప్పుడు, కరెన్సీ స్థిరీకరణ కోసం ఏ దేశమైనా ఎంత విలువైన జాతీయ సంపదను నిల్వ ఉంచగలుగుతుంది? ఆంక్షలు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో దేశాలు కొన్ని వస్తువుల కోసం డాలర్ ఆధారిత ధరల నుండి బయటపడటం మనం ఇప్పటికే చూశాము. ఉదాహరణకు, డాలర్‌ను పక్కనపెట్టి ఇరాన్ నుంచి రూపాయలలో చమురును భారత్ కొనుగోలు చేసింది. చైనా-రష్యా మరియు చైనా-జపాన్ డాలర్‌ను కాదని... తమ వాణిజ్య మారకంలో కొంత భాగాన్ని డీల్ చేస్తున్నాయి.