ఈ సమయంలో బంగారంపై ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

ఈ సమయంలో బంగారంపై ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

గత 3రోజులుగా పెరుగుతోన్న బంగారం ధర ఇవాళ శాంతించింది. ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌ గోల్డ్‌ రేట్‌ ఇవాళ ఒకశాతం పైగా తగ్గింది. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్‌ ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌లో రూ.300 తగ్గి రూ.41,079కు దిగివచ్చింది. గ్లోబల్‌ మార్కెట్లో బంగారం ధర అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ... దేశీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఇవాళ లాభాల స్వీకరణకు దిగారు. ఇతర ఆస్తుల్లో నష్టాలను పూడ్చడానికి లిక్విడిటీ పొజిషన్లను నగదు చేయాలని ఆలోచిస్తోన్న ఇన్వెస్టర్లు లాభాలను కూడా వదులుకున్నారు. 

Gold rate today: On MCX, prices were down at at  ₹41,039 per 10 gramకరోనా వైరస్‌ వ్యాప్తితో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి యుఎస్‌ చట్ట సభ సభ్యుల నుంచి సానుకూల నిర్ణయం రానుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలం నుంచి గోల్డ్‌ రేట్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతూ అస్థిరంగా కదలాడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఆస్కారముందని కమోడిటీ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. బంగారానికి 40,850-40,144 సమీపంలో సపోర్ట్‌ లభించవచ్చు. అలాగే 41,550-41900 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురయ్యే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.

ఎలాంటి స్ట్రాటజీతో ఉండాలి?
టెక్నికల్‌గా చూస్తే ఎంసీఎక్స్‌ గోల్డ్‌కు 42వేల దగ్గర గట్టి రెసిస్టెన్స్‌ ఉంది. దీంతో ఇన్వెస్టర్లు డిప్స్‌ స్ట్రాటజీని అవలంభిస్తూ రేట్‌ తగ్గినప్పుల్లా బంగారాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గోల్డ్‌కు 40144 వద్ద బలమైన మద్దతు ఉంటుందని, ఆ స్థాయి నుంచి పడిపోతే 38909  వద్ద సపోర్ట్‌ లభించే అవకాశముందని యెస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. అలాగే 42,399 మరియు 43,419 వద్ద గట్టి నిరోధక ఎదురయ్యే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. 

Gold YES Securities