ఇవాళ కరెన్సీ మార్కెట్‌కు సెలవు (march 25)

ఇవాళ కరెన్సీ మార్కెట్‌కు సెలవు (march 25)

మహారాష్ట్ర నూతన సంవత్సర ప్రారంభ రోజు అయిన గుడి పద్వా కారణంగా ఈరోజు కరెన్సీ మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్‌ జరగడంలేదు.  నిన్న కరోనా వైరస్‌ సంక్షోభంతో డీలాపడిన ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే యోచనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో నిన్న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు బలపడి 75.88కు చేరింది. 

కరోనా వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో దానిని స్థిరంగా ఉంచడానికి అమెరికా సహాయ ప్యాకేజీని ఆమోదిస్తుందనే అంచనాలతో ఇవాళ చమురు ధరలు పెరిగాయి. ప్రస్దుతం బ్రెంట్‌ క్రూడ్‌2.36 శాతం లాభపడి బ్యారెల్‌ ధర 27.79 డాలర్లకు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 10 డాలర్లకు పైగా పెరిగి 1671 డాలర్లకు చేరింది.