ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న అమర్ రాజా బ్యాటరీస్‌

ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న అమర్ రాజా బ్యాటరీస్‌

ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయడంతో ఇవాళ అమర రాజా బ్యాటరీస్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఇంట్రాడేలో దాదాపు 6 శాతం నష్టపోయిన షేర్‌  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 52వారాల సమీపానికి చేరినప్పటికీ... ఆ తర్వాత కోలుకుంది. ప్రస్తుతం అర శాతం లాభంతో రూ.389 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 9:35 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 45 వేల షేర్లకు పైగా ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6597.63 కోట్లుగా ఉంది. కంపెనీ పీ/ఈ 10.09, బుక్‌ వాల్యూ రూ.195.26, ఈపీఎస్‌ 37.67గా ఉంది. 

ఇక కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావంతో తన ఉత్పత్తి కార్యకలాపాలను ఈ నెల 31వరకూ నిలిపివేస్తున్నట్టు అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఆటోమోటివ్‌ బ్యాటరీలు, ఇండస్ట్రియల్‌ బ్యాటరీలు తయారు చేస్తోంది. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు, సమయానుకూలంగా చర్యలు తీసుకుంటామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.