స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం మందకొడిగా ట్రేడవుతున్నాయి. మన దేశంలో కరోనా వ్యాప్తి విస్తృతం అయ్యే అవకాశాలు ఉండడం.. 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించడం వంటి అంశాలు.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుండడంతో అనేక రంగాలకు చెందిన స్టాక్స్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి. 

ప్రస్తుతం సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 26854 వద్ద ఉండగా.. 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7853 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా 228 పాయింట్లు నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ 16879 వద్ద ట్రేడవుతోంది.

ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లోని షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండగా.. హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్‌గా ఉండగా.. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.