స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 25)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 25)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ జియోలో వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోన్న ఫేస్‌బుక్‌
ఇండియా బుల్స్‌ హౌజింగ్ ఫైనాన్స్‌: కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌, విదేశీ నగదు సీనియర్‌ సురక్షిత రేటింగ్‌ను B2 నుంచి B3కి డౌన్‌గ్రేడ్‌ చేసిన మూడీస్‌
ఒఎన్‌జీసీ: కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మూడీస్‌
యెస్‌ బ్యాంక్‌: సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన ఇక్రా
ఫెడరల్‌ బ్యాంక్‌: సంస్థలోని రూ.7.5 కోట్ల విలువైన 19.1 లక్షల షేర్లను విక్రయించిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శ్యామ్‌ శ్రీనివాసన్‌
గుజరాత్‌ ఆల్కలీస్‌: దాహెజ్‌ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన గుజరాత్‌ ఆల్కలీస్‌
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ : షేర్‌ విభజనకు ఏప్రిల్‌ 7ను రికార్డ్‌ డేట్‌గా ప్రకటించిన కంపెనీ
అపోలో టైర్స్‌: కోవిడ్‌-19 ప్రభావంతో కేరళ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్లాంట్‌లలో మార్చి 31 వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీ
ప్రతాప్‌ స్నాక్స్‌: రాజ్‌కోట్‌, ఇండోర్‌, గువాహతి ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసిన కంపెనీ
వీఐపీ ఇండస్ట్రీస్‌: మార్చి 31 వరకు నాసిక్‌, హరిద్వారా ప్లాంట్‌లలో కార్యకలాపాలను నిలిపివేసినట్టు ప్రకటించిన కంపెనీ
గోవా కార్బన్‌ : బిలాస్‌పూర్‌ ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన కంపెనీ