లాక్‌డౌన్‌లోనూ స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి!

లాక్‌డౌన్‌లోనూ స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి!

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ దాదాపుగా కర్ఫ్యూ వంటిదేనని... దేశాన్ని, దేశ ప్రజలను కరోనావైరస్ నుంచి కాపాడేందుకు ఇంట్లోనే తమను తాము బంధించుకోవడం ఒక్కటే మార్గమని ప్రధాని ప్రకటించారు.

దీంతో స్టాక్ మార్కెట్ల సంగతి ఏంటనే సందేహాలు అనేకమందిలో మొదలయ్యాయి. పలు రూమర్లు కూడా వ్యాపించడం మొదలవడంతో.. వెంటనే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ వర్గాలు స్పందించాయి.

మార్కెట్‌ తెరిచే ఉంటుందని ఎన్‌ఎస్ఈ వర్గాలు ప్రకటించగా... రోజువారీ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి అంటూ బీఎస్ఈ ఇండియా ట్వీట్ చేసింది.

స్టాక్ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేసే ఆలోచన ఏమీ లేదని ఎక్స్‌ఛేంజ్‌లు స్పష్టం చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ట్రేడింగ్ కొనసాగుతున్న సమయంలో.. మన మార్కెట్‌లను నిలుపుదల చేయడం సాధ్యం కాదని.. ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.