ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ హైలైట్స్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ హైలైట్స్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో లాక్‌డౌన్ ప్రకటించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీ ఇప్పటికే దాదాపుగా సిద్ధమైందని ప్రకటించిన ఆమె, అతి త్వరలోనే ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.,

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న పరిస్థితి నుంచి ఊరట కలిగించడం కోసం కొన్ని రెగ్యులేటరీ నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. ఇన్‌కం ట్యాక్స్, కస్టమ్స్, ఇన్‌సాల్వెన్సీ మరియు బ్యాంక్‌రప్టీ కోడ్, బ్యాంక్ సంబంధిత నిబంధనలు, ఫిషరీస్ సహా పలు అంశాలలో ఊరటలు అందించారు.

ఆదాయపు పన్ను
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు జూన్ 30, 2020 వరకు పొడిగింపు
ఆదాయపు పన్ను ఆలస్య రుసుము 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు
ఫైలింగ్, ట్యాక్స్ నోటీసులు సహా ఇతర అన్ని గడువులు జూన్ 30, 2020 వరకు పొడిగింపు
ఆధార్-పాన్‌లను లింక్ చేసేందుకు గడువు జూన్ 30, 2020 వరకు పొడిగింపు
వివాద్ సే విశ్వాస్ పథకం జూన్ 30, 2020 వరకు పొడిగింపు
జూన్ 30 వరకు వివాద్ సే విశ్వాస్ పథకంలో 10 శాతం అదనపు ఛార్జ్ తొలగింపు

ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించనున్నారనే వార్తలు పుకార్లు మాత్రమే

జీఎస్‌టీ
మార్చ్, ఏప్రిల్, మే 2020లకు జీఎస్‌టీ ఫైలింగ్ గడువు జూన్ 30, 2020 వరకు పొడిగింపు
విభిన్న తేదీలలో ఫైల్ చేయాల్సి ఉన్నా అన్నిటికీ జూన్ 30, 2020 వరకు గడువు
రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు వడ్డీ, పెనాల్టీ, లేట్‌ ఫీ నుంచి మినహాయింపు
పెద్ద కంపెనీలకు వడ్డీ మాత్రమే. లేట్‌ ఫీజు, పెనాల్టీల నుంచి మినహాయింపు


సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ 
వివాదాల పరిష్కారంలో భాగంగా సబ్‌కా విశ్వాస్ స్కీమ్ జూన్ 30, 2020 వరకు పొడిగింపు
కస్టమ్స్ క్లియరెన్స్ జూన్ 30, 2020 వరకు 24/7 కార్యకలాపాలు


కార్పొరేట్స్
బోర్డ్ మీటింగ్‌ల నిర్వహణను మరుసటి 60 రోజుల వరకు గడువు
మినిమం రెసిడెన్సీ రిక్వైర్‌మెంట్‌ను ఎవరైనా కంపెనీ డైరెక్టర్ వర్తింపచేయలేకపోతే, దానిని ఉల్లంఘనగా పరిగణించబోము
2020 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఒక్క మీటింగ్ నిర్వహించలేకపోయినా దానిని ఉల్లంఘనగా పరిగణించబోము


ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టీ కోడ్
ప్రస్తుత పరిమితి రూ. 1 లక్షను రూ. 1 కోటికి పెంపు
ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐబీసీ చట్టంలోని సెక్షన్ 7, 9, 10లను తదుపరి దశలలో సస్పెండ్ చేసే అవకాశం


ఫిషరీస్
ఫిషరీస్ కన్‌సైన్‌మెంట్ అరైవల్‌కు ఒక నెల ఆలస్యం పరిగణింపు. ఏప్రిల్‌తో ముగిసే ఫిషరీస్ దిగుమతుల పర్మిట్‌లు మరో మూడు నెలలు పొడిగింపు


బ్యాంకింగ్
రాబోయే మూడు నెలలో ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంల నుంచి అయినా విత్‌డ్రాయల్స్  ఉచితం
కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) నిబంధన కూడా తాత్కాలికంగా తొలగింపు
డిజిటల్ ట్రేడ్ మరియు లావాదేవీలకు బ్యాంక్ ఛార్జీలు తగ్గింపు