ఏడాది కనిష్టానికి HBL పవర్‌

ఏడాది కనిష్టానికి HBL పవర్‌

అన్ని ప్లాంట్‌లను మూసివేయడంతో ఇవాళ హెచ్‌బీఎల్‌ పవర్‌ 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రభుత్వ అధికార వర్గాల నుంచి తర్వాతి మార్గదర్శకాలు వచ్చేవరకు ప్లాంట్‌లలో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు హెచ్‌బీఎల్‌ పవర్‌ వెల్లడించింది.  దీంతో ఇవాళ ఇంట్రాడేలో 4శాతం పైగా నష్టపోయిన షేర్‌ రూ.10.70కి పడపోయింది. ప్రస్తుతం అరశాతం నష్టంతో రూ.11.15 వద్ద షేర్‌ కదలాడుతోంది.

ఇంట్రాడేలో షేర్‌ రూ.11.85 గరిష్ట స్థాయికి చేరి ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. గత నెల ఇదే సమయంలో కంపెనీ షేర్‌ రూ.16.70కి చేరింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.314.62 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈతో పోలిస్తే కంపెనీ పీ/ఈ కొంచెం అధికంగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 13.44 కాగా కంపెనీ పీ/ఈ 13.49గాఉంది. బుక్‌ వాల్యూ రూ.28.04 కాగా, ఈపీఎస్‌ 0.83గా ఉంది.