52 వారాల కనిష్టానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

52 వారాల కనిష్టానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 230శాతం పైగా నష్టంతో రూ.235.60 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఎవరూ ముందుకు రావట్లేదు. దీంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఓన్లీ సెల్లర్‌గా నిలిచింది. ఉదయం 10:45 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

Capture1

యెస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ వార్తలు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో గత నెలరోజుల్లో ఈ స్టాక్‌ భారీగా పతనమైంది. ఫిబ్రవరి 24న రూ.1170 వద్ద ట్రేడైన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుతం రూ.235కు పడిపోయింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.23,340.95 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 27.37 కాగా బ్యాంక్‌ పీ/ఈ 5.21గా ఉంది. ఇక బుక్‌ వాల్యూ రూ.381.24 కాగా, ఈపీఎస్‌ 64.54గా ఉంది.