నష్టాల్లోకి జారుకున్న సూచీలు, 7600 దిగువకు నిఫ్టీ

నష్టాల్లోకి జారుకున్న సూచీలు, 7600 దిగువకు నిఫ్టీ

దేశీయ మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. డే గరిష్టం వద్ద సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో నిఫ్టీ 7600 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 7589 వద్ద, సెన్సెక్స్‌ 71 పాయింట్ల నష్టంతో 25910 వద్ద ట్రేడవుతోన్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన బ్యాంక్‌ నిఫ్టీ ప్రస్తుతం 475 పాయింట్ల నష్టంతో 16440 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, మెటల్స్‌ సూచీలకు మాత్రం కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ 6.37శాతం, హెచ్‌యూలె్‌ 6.97శాతం, అదానీ పోర్ట్స్‌ 6.02శాతం, టెక్‌ మహీంద్రా 4.59శాతం, బ్రిటానియా 4.68శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 19.99శాతం, యెస్‌ బ్యాంక్‌ 8.30శాతం, హీరోమోటోకార్ప్‌ 6.47శాతం, బీపీసీఎల్‌ 5.42శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 4.99 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.