SBI కార్డ్స్‌లో జోష్‌, యెస్‌ బ్యాంక్‌ నేలచూపులు

SBI కార్డ్స్‌లో జోష్‌, యెస్‌ బ్యాంక్‌ నేలచూపులు

గత రెండురోజులుగా భారీగా నష్టపోయిన ఎస్‌బీఐ కార్డ్స్‌కు ఇవాళ భారీ కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం షేర్‌ 5శాతం పైగా లాభంతో రూ.612 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 9:23 నిమిషాల వరకు ఎన్‌ఎస్‌ఈల్లో 3లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.622.85కు చేరింది. 

మళ్ళీ యెస్‌ బ్యాంక్‌ నేలచూపులు
ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 7శాతం లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తిన యెస్‌ బ్యాంక్‌ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో రూ.43.70కు చేరి గరిష్ట స్థాయిని నమోదు చేసిన యెస్‌ బ్యాంక్‌ ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోవడంతో ఇంట్రాడేలో రూ.37.65కు పడిపోయింది. ప్రస్తుతం ఒకశాతం నష్టంతో రూ.38.60 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 9:26 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 98 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.