నెల రోజుల్లో రూ. 60 లక్షల కోట్లు మింగేసిన కరోనా!

నెల రోజుల్లో రూ. 60 లక్షల కోట్లు మింగేసిన కరోనా!

మార్కెట్లలో పతనం కొనసాగుతూనే ఉంది. ఇండెక్స్‌లు లోయర్ సర్క్యూట్‌లకు పడిపోవడం.. ట్రేడింగ్ నిలిచిపోవడం మళ్లీ మళ్లీ జరుగుతోంది. ఇండెక్స్‌లలో ఓలటాలిటీ తగ్గించడం కోసం సెబీ చేపట్టిన చర్యలు.. తాజాగా మార్చ్ 23న.. మొత్తంగా మూడో సారి మార్కెట్ల లోయర్ సర్క్యూట్‌కు కారణంగా నిలుస్తోంది

ఇన్వెస్టర్లు, ముఖ్యంగా ఎఫ్‌ఐఐలు ప్రపంచవ్యాప్తంగా మాద్యం ఎదురు కానుందనే భయాందోళనలు ఎదుర్కుంటున్నాయి. చైనా బయట కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడం.. ఇటలీ,  స్పెయిన్ వంటి దేశాలలో చైనాకు మించి మరణాలు నమోదు కావడం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.

ఇప్పటివరకూ 2.94 లక్షల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాగా... 13వేల మందికి పైగా మరణించారు.
తాజాగా మంగళవారం నాడు మార్కెట్లు లోయర్ సర్క్యూట్‌కు పడిపోవడంతో.. ఒకే రోజున ఇన్వెస్టర్ల సంపద 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 105.79 లక్షల కోట్లకు క్షీణించింది. గత శుక్రవారం చివరకు ఇది 116 లక్షల కోట్లుగా ఉండగా.. క్రమంగా ఇంకా క్షీణిస్తూనే ఉండడం భయాలను రెట్టింపు చేస్తోంది

మార్కెట్ల పతనం ఎక్కడ ఆగుతుందని చెప్పడం అసాధ్యంగా మారిందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఏ స్థాయిలో బ్రేక్ పడుతుంది.. తిరిగి ఏ లెవెల్స్ నుంచి మార్కెట్లలో రికవరీ మొదలవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని.. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తే కానీ.. ఇందుకు సమాధానం  లభించదని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులలో FY21 ఎర్నిగ్స్‌కు 11-13 రెట్ల వద్ద పెట్టుబడులు చేసేందుకు ఇన్వెస్టర్లు సిద్ధపడడం లేదు. ఇక్కడి నుంచి మరో 20 శాతం పతనం కూడా మార్కెట్లలో ఎదురుకావచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఫ్టీ 6800-8000 పాయింట్ల మధ్య కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే లాంగ్ టెర్మ్ ఇన్వెస్టర్లు దీనిని సరైన అవకాశంగా ఉపయోగించుకోవాలని.. ఇందుకు చవక వాల్యుయేషన్స్ కారణం అని అంటున్నారు.

వైరస్ వ్యాప్తి విస్తృతం అయినప్పటి నుంచి గత నెల రోజుల కాలంలో మార్కెట్లు 35 శాతం క్షీణించాయి. దీనితో గత నెల రోజుల కాలంలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 60 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.