ఐదేళ్ళ కనిష్టానికి అశోక్‌ లేలాండ్‌

ఐదేళ్ళ కనిష్టానికి అశోక్‌ లేలాండ్‌

HLFLలో వాటా కొనుగోలు ప్రతిపాదనలతో అశోక్‌ లేలాండ్‌ వరుసగా రెండో రోజూ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 15 శాతం పైగా నష్టపోయిన షేర్‌ ఐదేళ్ళ కనిష్ట స్థాయి రూ.41.10కి పడిపోయింది. తమ అనుబంధ సంస్థ హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్ లిమిటెడ్‌‌(HLFL)లో 19 శాతం వాటా కొనుగోలు చేయాలని ఈనెల 18న కంపెనీ నిర్ణయించింది. ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ ఎవర్‌స్టోన్‌ నుంచి 7శాతం, మరో ప్రమోటర్‌ నుంచి 12 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఈ విలువ రూ.1100-1200 కోట్లుగా ఉంది. 

HLFLలో వాటా టేకోవర్‌ ప్లాన్స్‌తో గత రెండు రోజుల్లో షేర్‌ విలువ 36శాతం కరిగిపోయింది. ఇవాళ ఇంట్రాడేలో 2014 సెప్టెంబర్‌ స్థాయికి షేర్‌ పడిపోయింది.  గత నెల 24న రూ.85 వద్ద ట్రేడైన ఈషేర్‌ ప్రస్తుతం ఆరున్నర శాతం నష్టంతో షేర్‌ రూ.45 వద్ద కదలాడుతోంది. గత నెల రోజుల్లో అశోక్‌ లేలాండ్‌ దాదాపు 50శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో షేర్‌ 52వారాల కనిష్టానికి పడిపోయింది. మధ్యాహ్నం 1:08 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 6.50 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.