భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ప్రస్తుతం భారీ లాభాల్లో కదలాడుతోన్నాయి. నిఫ్టీ 450 పాయింట్లు, సెన్సెక్స్‌ 1500 పాయింట్ల లాభంతో ట్రేడేవుతోన్నాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన బ్యాంక్‌ నిప్టీ లోయర్‌ లెవల్స్‌ నుంచి 1200 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మార్కెట్లను లీడ్‌ చేస్తోంది. ఐటీ ఇండెక్స్‌ 8 శాతం పైగా లాభంతో కొనసాగుతోంది. మెటల్, ఫార్మా, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీలు లాభాల్లో ట్రేడవుతోన్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఓఎన్‌జీసీ 14.25శాతం, గెయిల్‌ 12.54శాతం, విప్రో 12.87శాతం, టీసీఎస్‌ 12.33 శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 10.36శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 7.61 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.40 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.