మార్కెట్లను డ్రాగ్ చేస్తున్న ఫైనాన్షియల్స్

మార్కెట్లను డ్రాగ్ చేస్తున్న ఫైనాన్షియల్స్

మన మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమైనా.. ఆ ట్రెండ్‌ను కొంతసేపు కూడా కొనసాగించలేకపోయాయి. ట్రేడింగ్ మొదటి పావుగంట లాభాల్లో ఉన్న సూచీలు.. నెగిటివ్ సెంటిమెంట్‌తో ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి.

ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉండడం మన మార్కెట్లను విపరీతంగా అమ్మకాల ఒత్తిడికి గురి చేస్తోంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, భారీ నష్టాలు ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలను భారీగా నష్టాల్లోకి నడిపిస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏకంగా 7 శాతం పైగా నష్టపోతుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ 4 శాతం పైగా విలువ కోల్పోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ 4 శాతం నష్టపోగా.. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ స్టాక్స్‌ కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ఆర్థిక రంగానికి చెందిన స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో.. ప్రస్తుతం నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 8196 స్థాయికి పడిపోగా.. 1 శాతం దిగివచ్చిన సెన్సెక్స్ 28011 పాయింట్లకు దిగివచ్చింది.
బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 3.64 శాతం విలువను కోల్పోయి 19352 వద్ద ట్రేడవుతోంది.