స్టాక్‌ మార్కెట్ల మూసివేత? 

స్టాక్‌ మార్కెట్ల మూసివేత? 

కరోనా వైరస్‌ మహమ్మారితో కుప్పకూలుతోన్న స్టాక్‌ మార్కెట్లకు కొన్ని రోజులు హాలీడే ప్రకటించాలని డిమాండ్‌లు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన అసెట్‌ మేనేజర్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాంగ్‌ ముందుకు ఓ వినూత్న ప్రతిపాదనను తీసుకువచ్చారు. మార్కెట్లు బేరిష్‌ గ్రిప్‌లోకి వెళ్తుండటంతో కొన్ని రోజులు మూసివేయడమే మంచిదని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 

మార్కెట్లు భారీగా పతనం కావడం, దిగ్గజ సూచీలన్నీ కుదేలవడం, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న షేర్లు కూడా నేలచూపులు చూస్తుండటంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికా మార్కెట్ల విషయంలోనూ ఇదే ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా, ఇంగ్లాండ్‌లు మార్కెట్ల మూసివేతకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే మిగితా దేశాలు కూడా అదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి.