ఇండస్ఇండ్ బ్యాంక్... ఇంట్రాడే అతి పెద్ద పతనం

ఇండస్ఇండ్ బ్యాంక్... ఇంట్రాడే అతి పెద్ద పతనం

ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై పలు రూమర్స్ షికారు చేస్తుండగా.. వీటిని ఖండిస్తూ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. రీటైల్, కార్పొరేట్ విభాగాలలో నిలకడగా రాణిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విత్‌డ్రాయల్స్ చేసినా.. ప్రస్తుతం బ్యాంక్ ఎంతో స్ట్రాంగ్‌గా, లాభదాయకతతో ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ వర్గాలు చెప్పాయి.

అయితే ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ అతి పెద్ద పతనాన్ని చవి చూసింది. ఒక దశలో 40 శాతం పైగా నష్టంతో రూ. 374.80 కనిష్ట స్థాయికి ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ దిగి రాగా.. లోయర్ లెవెల్స్‌లో కొంతమేర కొనుగోళ్ల మద్దతు లభించింది.

ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి 23.73 శాతం నష్టంతో రూ. 460.80 వద్ద ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ నిలిచింది.