థైరోకేర్, డా. లాల్ పాథ్‌ల్యాబ్స్‌కు కరోనా సపోర్ట్

థైరోకేర్, డా. లాల్ పాథ్‌ల్యాబ్స్‌కు కరోనా సపోర్ట్

థైరోకేర్ టెక్నాలజీస్, డా. లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్‌లు ఇవాళ ఇంట్రాడేలో భారీ లాభాలు గడించాయి. కరోనా వైరస్‌ టెస్టింగ్ చేసేందుకు ప్రైవేటు ల్యాబరేటరీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం.. ఈ కౌంటర్‌లలో కొనుగోళ్లకు కారణంగా నిలుస్తోంది.

భారతదేశంలో కరోనా వైరస్ (కోవిద్-19) కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ఈ వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌కు అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాత్రమే ప్రభుత్వ ల్యాబలేటరీలలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 52 వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబరేటరీలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్స్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి లభించడంతో.. ఇవాళ ఇంట్రాడేలో డా. లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్ ధర రూ. 1640 వరకూ పెరిగింది. హైయర్ లెవెల్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణగా ప్రస్తుతం 3.06 శాతం లాభంతో రూ. 1,548.65 వద్ద ఈ షేర్ ట్రేడవుతోంది.

మరోవైపు థైరోకేర్ టెక్నాలజీస్ కూడా ఇంట్రాడేలో 9 శాతం పైగా లాభంతో రూ. 586 వరకు పెరగగా.. ప్రస్తుతం 6.77 శాతం నష్టంతో రూ. 500 వద్ద ఈ షేర్ ట్రేడవుతోంది.