ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనసాగుతోన్న పతనం

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనసాగుతోన్న పతనం

కోవిడ్‌-19తో ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ భారీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌తో పాటు మరో 19 స్టాక్స్‌ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(NBFC), మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు, ఇన్సూరెన్స్‌ సంస్థల షేర్లు భారీ కరెక్షన్‌కు గురవుతోన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, మణప్పురం ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు 52వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోన్నాయి. మిగిలిన కంపెనీల వివరాలు దిగువ ఉన్నాయి.