Closing Bell : రక్త కన్నీరు

Closing Bell : రక్త కన్నీరు

మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌, అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు, ఇరాక్‌పై అమెరికా సైనిక దాడులతో దేశీయ మార్కెట్లు భారీ ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల సూచీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్లూ చిప్‌ స్టాక్స్‌ దశాబ్ద కాల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్‌  2017 స్థాయికి పడిపోయింది. 2008 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద నష్టం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 7-8శాతం నష్టపోయాయి. నిఫ్టీ 32 నెలల కనిష్టానికి పడిపోయింది. ఒకదశలో 9500 మార్కు దిగువకు పడిపోయేటట్లు కనిపించిన నిఫ్టీ ఆ తర్వాత కోలుకుని 868 పాయింట్ల నష్టంతో 9590 వద్ద ట్రేడింగ్‌ ముగించింది. ఇది 2008 అక్టోబర్‌ 24 స్థాయి కావడం విశేషం. సెన్సెక్స్‌ 2919 పాయింట్ల నష్టంతో 32,778 వద్ద క్లోజైంది. బ్యాంక్‌ నిఫ్టీ తొమ్మిదిన్నర శాతం నష్టంతో 2516 పాయింట్లు క్షీణించి 23,971 వద్ద స్థిరపడింది. ఒలటాలిటీ ఇండెక్స్‌ 2009 జూలై స్థాయికి పెరిగింది. రూ.11లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. మార్కెట్లు ఎంతగా పతనం అయ్యాయంటే 783 కంపెనీలు తమ 52వారాల అత్యల్పస్థాయిలో ట్రేడ్‌ అయ్యాయి.వీటిల్లో రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌పీసీఎల్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, స్పైస్‌జెట్‌, ఏబీబీ, హీరో మోటో, ఏసీసీ, బీఈఎంఎల్‌,గెయిల్‌,గిల్లెట్‌, గ్లెన్‌మార్క్‌ వంటి దిగ్గజ షేర్లు ఉన్నాయి. మిగిలిన సూచీల వివరాలు దిగువ ఉన్నాయి. 

View image on Twitter

Nifty IT
13384.80    -1296.60    -8.83%

BSE SmallCap
11614.89    -1110.26    -8.72%

BSE MidCap
12380.36    -1052.78    -7.84%

Nifty Auto
6033.40    -535.05    -8.15%

BSE Cap Goods
13363.02    -1214.21    -8.33%

BSE Cons Durable
23214.64    -1676.39    -6.73%

BSE FMCG
9754.26    -734.67    -7.00%

BSE Healthcare
12249.89    -1106.60    -8.29%

BSE Metals
6611.91    -685.28    -9.39%

BSE Oil & Gas
10265.63    -1118.43    -9.82%

BSE Teck
6615.61    -572.97    -7.97%

Nifty PSE
2268.75    -255.15    -10.11%