ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రీబౌండ్‌కు కారణమేంటంటే..?

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రీబౌండ్‌కు కారణమేంటంటే..?

గత 2 రోజులుగా భారీగా నష్టపోయిన ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌లో ఇవాళ బౌన్స్‌ వచ్చింది. ఇవాళ ఇంట్రాడేలో షేర్‌ 15శాతం పైగా లాభపడి రూ.238.95కు చేరింది. ప్రస్తుతం 9శాతం లాభంతో రూ.226 వద్ద షేర్‌ కదలాడుతోంది. మధ్యాహ్నం 2:30 సమయానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 3.37 కోట్ల షేర్లు చేతులు మారాయి. గత రెండు రోజులుగా చూస్తూ ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌ 31 శాతం నష్టపోయింది. సోమవారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ కనిష్టం రూ.199 స్థాయికి షేర్‌ పడిపోయింది. 

"సోషల్‌ మీడియాలో సంస్థ ఆర్థిక పరిస్థితి, స్థిరత్వం గురించి తప్పుగా పుకార్లు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఆర్థికంగా బలంగా ఉంది." అని ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో  ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ క్లారిటీ ఇచ్చింది. దీంతో యెస్‌ బ్యాంక్‌లో రీబౌండ్‌ వచ్చింది. ఈ ఏడాది జనవరి 22న ప్రకటించిన క్యూ-3 రిజల్ట్స్‌లో ఆస్తినాణ్యతలో ఎటువంటి ప్రతికూల మార్పులు జరగలేదు. బ్యాంక్‌ మూలధన సమృద్ధి నిష్పత్తి 16.08తో పోలిస్తే టైర్‌-1లో 15.02 శాతంగా ఉంది. ఏదేమైనా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌పై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.