రక్తటేరు : దేశీయ సూచీలకు మరో బ్లాక్‌ మండే

రక్తటేరు : దేశీయ సూచీలకు మరో బ్లాక్‌ మండే

ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌సెషన్‌లో భారీ కరెక్షన్‌కు గురైన సూచీలు చివరి సెషన్‌లో కోలుకున్నప్పటికీ భారీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. దీనికితోడు సౌదీ, రష్యా మధ్య తలెత్తిన చమురు పోరు మరింత ముదరడం, దీంతో క్రూడాయిల్‌ ధరలు 30 శాతం పైగా క్షీణించడం మార్కెట్లను క్రుంగదీసింది. ఇవన్నీ చాలవన్నట్లు యెస్‌బ్యాంక్‌లో అవకతవకల పుట్ట పగిలి లోపాలు బయటకు వచ్చి బ్యాంకింగ్‌ షేర్ల విలువను స్వాహా చేస్తున్నాయి. దీంతో 5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మొత్తంమీద సెన్సెక్స్‌ 1942 పాయింట్ల నష్టంతో 35,635 పాయింట్ల వద్ద, నిఫ్టీ 538 పాయింట్ల నష్టంతో 10,451 వద్ద, బ్యాంక్‌ నిఫ్టీ 1339 పాయింట్ల నష్టంతో 26,462 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. 

Nifty IT
14854.90    -808.55    -5.16%

BSE SmallCap
12770.55    -559.23    -4.20%

BSE MidCap
13554.07    -673.42    -4.73%

Nifty Auto
6632.15    -262.85    -3.81%

BSE Cap Goods
14522.58    -666.46    -4.39%

BSE Cons Durable
25134.97    -765.72    -2.96%

BSE FMCG
10467.14    -339.09    -3.14%

BSE Healthcare
13505.03    -462.97    -3.31%

BSE Metals
7417.80    -611.93    -7.62%

BSE Oil & Gas
11603.23    -639.09    -5.22%

BSE Teck
7264.43    -392.76    -5.13%

Nifty PSE
2560.45    -119.20    -4.45%

క్రూడాయిల్‌ ధర ఎందుకు తగ్గిందంటే..
ప్రపంచంలో అత్యధిక క్రూడాయిల్‌ ఉత్పత్తి చేసే దశలో అగ్రగామి దేశాలు రష్యా, సౌదీ అరేబియా. గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య అవగాహన దెబ్బతినడంతో ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. రష్యాను దెబ్బతీయడానికి ఒపెక్‌ దేశౄలు చమురు ఉత్పత్తిని గనణీయంగా పెంచాలని నిర్ణయించాయి. దీని ఫలితంగా ఇవాళ క్రూడాయిల్‌ ధర 30శాతం పైగా తగ్గింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌లో బ్యారెల్‌ ధర 11.38 డాలర్లు తగ్గి 33.89 డాలర్లు పలుకుతోంది. ఇంట్రాడేలో ఒకదశలో క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 31.02 డాలర్లకు పడిపోయింది. గల్ఫ్‌ వార్‌తో 1991 జనవరి 17 తర్వాత బ్రెంట్‌ ఫ్యూచర్స్‌లో భారీ పడిపోవడం ఇదే తొలిసారి. క్రూడాయిల్‌ ధరల భారీగా తగ్గడం దేశీయ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. చమురు ఉత్పత్తి రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న రిలయన్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు భారీ ఒత్తిడికి లోనయ్యాయి. ఇకదశలో ఈ షేర్లు 15శాతం వరకు పడిపోయాయి. 

కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లన్నింటినీ బెంబెలెత్తిస్తోంది. ఒక్క ఇటలీలోనే 1.60 కోట్ల మంది కరోనా వైరస్‌ అనుమానంతో నిర్భందంలో ఉండటం ఇన్వెస్టర్లలో ఆందోళన పుట్టిస్తోంది. అలాగే చైనాలో 50కోట్ల మంది వరకు క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే బాధితుల సంఖ్య 1,07,000 దాటిపోవడంతో పాటు చైనా బయట కూడా మృతుల సంఖ్య వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌లో 2.4 ట్రిలియన్‌ డాలర్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నష్టపోవచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేయడం మార్కెట్లకు దడపుట్టిస్తోంది. మరోవైపు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే 211 బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరై పోతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ అంచనా వేయడం మార్కెట్లకు మరో దెబ్బగా చెప్పొచ్చు. 

ఇక యూరోపియన్‌ మార్కెట్లు కూడా ప్రస్తుతం భారీ నష్టాల్లో కదలాడుతోన్నాయి. ఆ వివరాలు దిగువ ఉన్నాయి. 
CAC    4801.51    -337.60    -6.57%
DAX     10801.21    -740.66    -6.42%
FTSE    6048.19    -414.36    -6.41%