కుప్పకూలిన దేశీయ మార్కెట్లు

కుప్పకూలిన దేశీయ మార్కెట్లు

కరోనా వైరస్‌ ప్రపంచ మార్కెట్లను బెంబెలెత్తిస్తోంది. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశముందన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ ఇంట్రాడేలో 6శాతం పైగా నష్టపోయి 15 నెలల కనిష్టానికి పడిపోయింది. ఒలటాలిటీ ఇండెక్స్‌ నాలుగేళ్ళ గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4శాతం పైగా కరెక్షన్‌కు గురైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 2400 పాయింట్ల నష్టంతో 35200 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 666 పాయింట్ల నష్టంతో 10350 దిగువకు పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీ 1750 పాయింట్లకు పైగా నష్టంతో 26వేల సమీపంలో ట్రేడవుతోంది. 

హెవీ వెయిట్‌ స్టాక్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ కరెక్షన్‌కు గురై నష్టాల మార్కెట్‌ను లీడ్‌ చేస్తోంది. అదే విధంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ స్టాక్‌ కూడా భారీగా నష్టపోయాయి. యెస్‌ బ్యాంక్‌ మాత్రం 30శాతం లాభంతో 20.95 వద్ద ట్రేడవుతోంది. బీపీసీఎల్‌ 7శాతం, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ అరశాతం, ఐఓసీ 0.10శాతం లాభంతో కొనసాగుతోన్నాయి. ఓఎన్‌జీసీ 14.35శాతం, వేదాంతా 13.46శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 13.27శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 12.59శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.94శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.