మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన జియో

మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన జియో

టెలికాం రంగ సంచలనం జియో.. కస్టమర్లకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతేడాది చివర్లో ఉచిత అవుట్‌గోయింగ్‌ను ఎత్తివేసి కస్టమర్లకు షాకిచ్చిన జియో.. ఇప్పుడు అంతకుమించి వణికించేందుకు సిద్ధమైంది. వైరస్‌లెస్‌ డేటా టారిఫ్‌ను రూ.15(ఒక జీబీ) నుంచి రూ.20కి పెంచాలని రిలయన్స్‌ జియో యోచనిస్తోంది. ఇప్పటికే  టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు లేఖ రాసిన జియో, ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు రాసిన లేఖలో జియో తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయని జియో వెల్లడించింది. 

ఇక టెలికాం సేవల్లోని టారిఫ్‌ సమస్యలపై జియో కన్సల్టేషన్‌ పేపర్‌ను ట్రాయ్‌కు సమర్పించింది. దేశీయ వినియోగదారులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీసులను పొందాలని అనుకుంటారని, అందుకే పెరిగిన ఛార్జీలను 2-3 విడతల్లో అమలు చేసే వెసులు బాటు కల్పించాలని ట్రాయ్‌కి రాసిన లేఖలో జియో కోరింది.