10 శాతం క్షీణించిన ఐఓఎల్ కెమికల్స్

10 శాతం క్షీణించిన ఐఓఎల్ కెమికల్స్

ఫార్మా రంగంలో సేవలు అందిస్తున్న ఐఓఎల్ కెమికల్స్.. ఇవాల్టి ట్రేడింగ్‌లో భారీ నష్టాలను నమోదు చేస్తోంది. ఇవాళ ట్రేడింగ్ ఆరంభంలో లాభాల్లోనే ఉన్న ఈ స్టాక్.. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయింది.

గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పైగా క్షీణించిన ఈ కౌంటర్‌లో వాల్యూమ్స్ కూడా భారీగా నమోదు అవుతున్నాయి. సగటుతో పోల్చితే దాదాపు 4 రెట్ల వాల్యూమ్స్  ఈ కౌంటర్‌లో కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం 8.59 శాతం నష్టంతో రూ. 273.00 వద్ద ఐఓఎల్ కెమికల్స్ ట్రేడవుతోంది. ఇవాళ ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ. 316.50 గరిష్ట స్థాయిని నమోదు చేసింది.