భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు.. కరోనా వైరస్ భయాలు.. ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు కీలకమైన స్థాయిలకు దిగువనే ట్రేడవుతున్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 39525 వద్ద ఉండగా.. 110 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11568 వద్ద ట్రేడవుతోంది. 290 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 30 వేల పాయింట్లకు చేరువలో ఉంది.

అన్ని సెక్టార్లు నెగిటివ్‌గానే ఉండగా.. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కౌంటర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

ప్రస్తుతం నిఫ్టీలో యస్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రో, ఓఎన్‌జీసీ, సిప్లా, ఎం అండ్ ఎం టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.