యూఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్‌తో సిప్లా 5 శాతం డౌన్

యూఎస్ ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్‌తో సిప్లా 5 శాతం డౌన్

యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి వార్నింగ్ లెటర్ అందడంతో.. సిప్లా షేర్ ఇవాళ భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కుంటోంది. ట్రేడింగ్ ఆరంభంలోనే 5 శాతం నష్టపోయిన ఈ షేర్.. ఒక దశలో రూ. 405.80 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

2019 సెప్టెంబర్ 16-27 మధ్యలో... గోవా మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో వెల్లడైన పలు అంశాలపై వార్నింగ్ లెటర్‌ను సంస్థ జారీ చేసింది.

కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న సిప్లా షేర్ ధర.. ప్రస్తుతం 1.05 శాతం నష్టంతో రూ. 421.35 వద్ద ట్రేడవుతోంది. లోయర్ లెవెల్స్ నుంచి 4 శాతంపైగా ఈ షేర్ కోలుకోవడం గమనించాలి.