40వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్

40వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు.. కరోనావైరస్ వ్యాప్తి చెందుతూ ఉండడం.. ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా 3 శాతం పైగా నష్టాలను నమోదు చేశాయి.

ఫ్రంట్‌లైన్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా.. ఇవాళ సెన్సెక్స్ 40 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. 15 సెషన్స్ తర్వాత మళ్లీ సెన్సెక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 290 పాయింట్ల నష్టంతో 39991 వద్ద ఉండగా.. 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11711 వద్ద నిలిచింది. 188 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 30244 వద్ద ట్రేడవుతోంది.

ఇవాళ ట్రేడింగ్ ఆరంభం నుంచి సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టార్ మినహా.. మిగిలిన అన్ని రంగాలు నెగిటివ్‌గానే ఉన్నాయి. మెటల్స్ కౌంటర్ అత్యధికంగా నష్టపోతుండగా.. ఐటీ, టెక్నాలజీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది.

నిఫ్టీలో హిందుస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సెస్లే ఇండియా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా... సన్ ఫార్మా, టాటా మోటార్స్, హిందాల్కో, సిప్లా, ఐషర్ మోటార్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.