జీఎంఆర్ కౌంటర్‌లో లాభాలు కంటిన్యూ

జీఎంఆర్ కౌంటర్‌లో లాభాలు కంటిన్యూ

జీఎంఆర్ ఇన్‌ఫ్రా కౌంటర్‌లో ఇవాళ కూడా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. నిన్న ట్రేడింగ్‌లో 8 శాతం లాభపడిన ఈ షేర్‌కు.. ఇవాళ కూడా బయింగ్ సపోర్ట్ లభిస్తోంది.
ఇంట్రాడేలో 4 శాతం పైగా జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేర్ లాభపడింది.
జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో 49 శాతం వాటాను ఫ్రాన్స్‌ గ్రూప్ ఏడీపీకి విక్రయించేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం ఇవ్వడంతో, ఈ స్టాక్‌లో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

గ్రీన్ ఛానల్‌ ద్వారా రెగ్యులటరీ క్లియర్ ఇవ్వగా.. ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కొన్ని నిబంధనలకు అనుగుణంగా వేగంగా అనుమతులు లభించనున్నాయి.

ఈ వార్తల ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్‌లో రూ. 26.45 వరకు చేరుకున్న జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేర్ ధర.. ప్రస్తుతం 1.35 శాతం లాభంతో రూ. 25.80 వద్ద ట్రేడవుతోంది.