నవీన్ ఫ్లోరిన్ అప్పర్ సర్క్యూట్

నవీన్ ఫ్లోరిన్ అప్పర్ సర్క్యూట్

అంతర్జాతీయ సంస్థ నుంచి పలు సంవత్సరాలకు కాంట్రాక్ట్ లభించడంతో.. ఇవాళ నవీన్ ఫ్లోరిన్ షేర్ ధర అప్పర్‌ సర్క్యూట్ వద్ద లాక్ అయింది. పూర్తి అనుబంధ సంస్థ అయిన నవీన్ ఫ్లోరిన్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ద్వారా ఈ కాంట్రాక్టును నిర్వహించనున్నారు.

గత ఏడాది కాలంలో నవీన్ ఫ్లోరిన్ షేర్ ధర 143 శాతం శాతం లాభపడి.. రికార్డు గరిష్ట స్థాయి రూ. 1455కు నవీన్ ఫ్లోరిన్ షేర్ చేరుకుంది. 

"ఫ్లోరో-కెమికల్స్ విభాగంలో హై-పెర్ఫామెన్స్ ప్రొడక్ట్‌ను సప్లై చేసేందుకు రూ. 2900 కోట్ల విలువైన 410 మి. డాలర్ల మల్టీ-ఇయర్ కాంట్రాక్ట్‌ను నవీన్ ఫ్లోరిన్ దక్కించుకుంది."

ఈ వార్తల ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్‌లో 20 శాతం లాభపడిన నవీన్ ఫ్లోరిన్ షేర్ ధర రూ. 1,454.30 వద్దకు చేరుకుంది.