వరుసగా నాల్గోరోజు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అప్పర్‌ సర్క్యూట్‌

వరుసగా నాల్గోరోజు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అప్పర్‌ సర్క్యూట్‌

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో అమెరికాకు చెందిన ఫండ్‌ హౌజ్‌ టిల్డెన్‌ పార్క్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ వాటాను కొనుగోలు చేయనుందనే వార్తలతో వరుసగా నాల్గో రోజు ఈ స్టాక్ అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద లాకైంది‌. గత వారం రోజుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ 41శాతం లాభపడింది. దీంతో కంపెనీ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ దాదాపు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం 5శౄతం లాభంతో రూ.20.90 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ 9.30 లక్షలు, బీఎస్‌ఈలో 2,53,627 షేర్లు కొనుగోలు కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్స్‌ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.703.73 కోట్లుగా ఉంది. బుక్‌ వాల్యూ రూ.51.31గా నమోదైంది. మరోవైపు బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఏ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదన రాలేదని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తెలిపింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');