ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్టు మూడీస్‌ ప్రకటించింది. బ్యాంక్‌ రుణ నాణ్యత మరింత క్షీణించే ప్రమాదం ఉన్నందున రేటింగ్‌ను తగ్గిస్తున్నట్టు మూడీసీ తెలిపింది. దీంతో ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3 శాతం పైగా నష్టపోయింది. గత ఏడాది అక్టోబర్‌ 11న బ్యాంక్‌ షేర్‌ 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,192కు పడిపోయింది. 

ఇక లోయర్‌ లెవల్స్‌లో లభించిన బయ్యింగ్‌ సపోర్ట్‌తో ఇంట్రాడేలో లాభాల బాటలోకి మళ్ళినప్పటికీ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అరశాతం నష్టంతో రూ.1286 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఉదయం 10:25 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 46 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.88,149.86 కోట్లు, బుక్‌ వాల్యూ రూ.381.32, ఈపీఎస్‌ 64.56గా ఉంది. ఇక ఇండస్ట్రీ పీ/ఈ 40.06 కాగా, కంపెనీ పీ/ఈ 19.69గా ఉంది. 

"గత కొన్ని త్రైమాసికాల్లో చూస్తే బ్యాంక్ దాని ఆస్తి నాణ్యతలో ముఖ్యంగా కార్పొరేట్ విభాగంలో క్షీణతను నమోదుచేసింది. టెలికమ్యూనికేషన్ రంగంలో కొనసాగుతున్న ఒత్తిడి వల్ల బ్యాంకు కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాబోయే 12-18 నెలల్లో బ్యాంక్ తన ఎన్‌పిఎల్ నిష్పత్తులను ప్రస్తుత స్థాయిలలో కొనసాగిస్తే, బ్యాంకు యొక్క దృక్పథాన్ని స్థిరంగా మార్చగలదని" మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది.