MCLR రేటును తగ్గించిన బీఓబీ

MCLR రేటును తగ్గించిన బీఓబీ

రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 8.25 శాతంగా ఉన్న ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీ రేటు 8.15 శాతానికి తగ్గనుంది. ఇవాళ్టి నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని బీఓబీ తెలిపింది. 

వడ్డీరేట్ల తగ్గింపుతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఒకశాతం లాభపడిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రస్తుతం స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. డే గరిష్టం(రూ.91.20) నుంచి దాదాపు ఒకటిన్నర శాతం దిగువన షేర్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం అరశాతం నష్టంతో రూ.89.95 వద్ద ట్రేడ్‌ కదలాడుతోంది. ఉదయం 10:15 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 28.50 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.42,070.26 కోట్లు, బుక్‌ వాల్యూ రూ.100.28గా ఉంది.
 



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');