లాభాలతో ప్రారంభం

లాభాలతో ప్రారంభం

వరుసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు  కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 350 పాయింట్ల లాభంతో 41,565 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 12,205 వద్ద ట్రేడవుతోన్నాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టీ 230 పాయింట్ల లాభంతో 31530 వద్ద కొనసాగుతోంది. క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా అన్ని రంగాల కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. మిగిలిన సూచీల వివరాలు ఇలా ఉన్నాయి. 

Nifty IT
16503.00    50.70    +0.31%

BSE SmallCap
14789.83    39.88    +0.27%

BSE MidCap
15914.02    78.37    +0.49%

Nifty Auto
7953.05    60.65    +0.77%

BSE Cap Goods
16891.42    -18.34    -0.11%

BSE Cons Durable
26862.70    50.52    +0.19%

BSE FMCG
11533.12    80.32    +0.70%

BSE Healthcare
14391.64    57.53    +0.40%

BSE Metals
9898.55    119.74    +1.22%

BSE Oil & Gas
14323.07    88.30    +0.62%

BSE Teck
8108.83    45.89    +0.57%

Nifty PSE
3079.70    18.40    +0.60%

ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్‌ 2.20 శాతం, వేదాంతా 1.92 శాతం, టాటామోటార్స్‌ 1.59 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.49 శాతం, గ్రాసీం 1.56 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యెస్‌ బ్యాంక్‌ 3.39 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.21 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 0.90 శాతం, గెయిల్‌ 0.12 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 0.41 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.