స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఫిబ్రవరి 12)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (ఫిబ్రవరి 12)
 • Q3లో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం 19.5 శాతం క్షీణతతో రూ.12.2 కోట్లుగా నమోదు
 • 3డీ డిజిటల్‌ బిల్డింగ్‌ మోడళ్లను తయారు చేసే వన్‌వర్క్‌ బీఐఎం టెక్నాలజీస్‌ను స్వాధీనం చేసుకునేందుకు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
 • మూడో త్రైమాసికంలో రూ.5.09 కోట్ల నుంచి రూ.4.06 కోట్లకు తగ్గిన పిట్టీ ఇంజనీరింగ్‌ నికరలాభం 
 • క్యూ-3లో తగ్గిన సిండికేట్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు, రూ.108 కోట్లుగా నమోదైన నికరలాభం
 • గౌట్‌ వ్యాధి నివారణకు వినియోగించే జెనెరిక్‌ ఔషధం కోల్చికైన్‌ ట్యాబ్లెట్స్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి గ్రాన్యూల్స్‌ ఇండియాకు తాత్కాలిక అనుమతి
 • టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ పేరు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌గా మార్పు చేస్తున్నట్టు ప్రకటించిన టాటా గ్రూప్‌
 • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను "స్టేబుల్‌" నుంచి "నెగిటివ్‌"కు మార్చిన మూడీస్‌
 • ఫిబ్రవరి 14న జరిగే బోర్డు మీటింగ్‌ రుణాల ద్వారా నిధులను సేకరించడంపై నిర్ణయం తీసుకోనున్న గ్లెన్‌మార్క్‌
 • ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ బాండ్స్‌ ద్వారా రూ.1500 కోట్ల నిధులను సేకరించిన ఎన్‌హెచ్‌పీసీ
 • న్యూల్యాండ్‌ ల్యాబ్స్‌ సీఎఫ్‌ఓ అమిత్‌ అగర్వాల్‌ రాజీనామా, మార్చి 6 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
 • సంస్థ ఎండీ, సీఈఓగా ఆశు సుయాశ్‌ను తిరిగి నియమించిన క్రిసిల్‌, 2025 జూన్‌ వరకు పదవిలో కొనసాగనున్న ఆశు సుయాశ్‌
 • ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌ సీఎఫ్‌ఓ తనుశ్రీ బగ్రోడియా రాజీనామా, ఈనెల 17 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
 • ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు సెబీ అనుమతి, ఈ నెలాఖరులో ఇష్యూకు వచ్చే అవకాశం
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఆల్ఫాజియో, అపోలో పైప్స్‌, శంకరా బిల్డింగ్‌, టీడీ పవర్‌, ఎవరెస్ట్‌ ఆర్గానిక్స్‌, గుజరాత్‌ థెమిస్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న జీఎస్‌ఎస్‌ ఇన్ఫోటెక్‌, శ్రేయాస్‌ షిప్పింగ్‌, ప్రీమియర్‌ సింథెటిక్స్‌
 • రుచి సోయా, జీటీఎల్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ సర్క్యూట్‌ పిల్టర్‌ 5 శాతానికి సవరింపు