7 నెలల గరిష్టానికి వొకార్డ్

7 నెలల గరిష్టానికి వొకార్డ్

వరుసగా మూడోరోజూ వొకార్డ్‌లో లాభాలు కొనసాగుతోన్నాయి. ఇంట్రాడేలో 13శాతం పైగా లాభపడటంతో షేర్‌ రూ.411.60కు చేరింది. ఇది 7 నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. హెవీ వాల్యూమ్స్‌తో గత ఏడాది జూన్‌ 27 తర్వాత వొకార్డ్ గరిష్ట స్థాయికి చేరింది. గత నెల రోజుల్లో ఈ షేర్‌ 63 శాతం పెరిగింది. 

ఇక ప్రస్తుతం వొకార్డ్‌ 10 శాతం లాభంతో రూ.399 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 88 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,484.21 కోట్లు కాగా, బుక్‌ వాల్యూ రూ.1110.77గా నమోదైంది.