రికార్డు స్థాయి గరిష్టానికి జీఎంఎం ఫ్రాడ్లర్‌

రికార్డు స్థాయి గరిష్టానికి జీఎంఎం ఫ్రాడ్లర్‌

క్యూ-3 రిజల్ట్స్‌ మెరుగ్గా ఉండటంతో జీఎంఎం ఫ్రాడ్లర్‌లో జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో మరో 13 శాతం లాభపడటంతో షేర్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరింది. హెవీ వాల్యూమ్స్‌తో గత 14 రోజుల్లో షేర్‌ విలువ 52శాతం పెరిగింది. ఈనెల 5న రూ.3048కి చేరిన జీఎంఎం ఫ్రాడ్లర్‌ ఇంట్రాడేలో ఈ రికార్డును అధిగమించి ఇంట్రాడేలో రూ.3,285 స్థాయికి చేరింది. ప్రస్తుతం 11.50శాతం పైగా లాభంతో రూ.3250 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 1.26 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,716.70 కోట్లకు చేరింది. బుక్‌ వాల్యూ రూ.148.94 కాగా, ఈపీఎస్‌ 43.03గా ఉంది. ఇక ఇండస్ట్రీ పీ/ఈ 14.11 కాగా, కంపెనీ పీ/ఈ 75.02గా ఉంది. 

ఫార్మా, కెమికల్‌ ఇండస్ట్రీ విభాగాలకు సంబంధించిన నిర్వహణ పరికరాల సరఫరాదారు జీఎంఎం ఫ్రాడ్లర్‌. ఈ కంపెనీ డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో 74శాతం వృద్ధితో రూ.21.1 కోట్ల ఏకృకృత నికరలాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికరలాభం రూ.12.1 కోట్లుగా ఉంది. నిర్వహణ ఆదాయం 19శాతం వృద్ధితో రూ.131 కోట్ల నుంచి రూ.156 కోట్లకు ఎగబాకింది. Ebitda 46 శాతం వృద్ధితో రూ.30.4 కోట్లకు పెరగ్గా, ఎబిటా మార్జిన్‌ 400 బేసిస్‌ పాయింట్లు పెరిగి 16శాతం నుంచి 20 శాతానికి చేరింది. 

రసాయన, ఔషధ రంగాల నుండి బలమైన డిమాండ్ నేపథ్యంలో ఆర్డర్ బుక్ మెరుగ్గా ఉందని జీఎంఎం ఫ్రాడ్లర్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. బలమైన డిమాండ్ వాతావరణాన్ని చూసే సామర్థ్యాన్ని కంపెనీ ఎంపిక చేస్తుంది. కంపెనీని తదుపరి స్థాయి స్థిరమైన వృద్ధికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఐదేళ్ల ప్రణాళికను కూడా కంపెనీ రూపొందించింది.