డీడీటీ తొలగించాక ఈ ఎంఎన్‌సీ స్టాక్స్‌ పరిస్థితి ఏంటి?

డీడీటీ తొలగించాక ఈ ఎంఎన్‌సీ స్టాక్స్‌ పరిస్థితి ఏంటి?

బడ్జెట్ 2020లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇన్వెస్టర్లు, యూనిట్‌హోల్డర్స్ మాత్రం తాము అందుకున్న డివిడెండ్స్‌ను ఆదాయంలో చూపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కానీ కంపెనీలు ఇకపై డీడీటీని వసూలు చేసి, చెల్లించాల్సించాల్సిన అవసరం లేదు. ఇది కస్టమర్లకు భారీగా డివిడెండ్స్ అందించే కంపెనీలకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీలకు ఊతం ఇచ్చే చర్యగా చెబుతున్నారు.

తమ సంస్థ ఏర్పాటు చేసిన దేశంతో పాటు కనీసం ఏదైనా మరొక దేశంలో కూడా ఎంఎన్‌సీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం ఎంఎన్‌సీలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌తో పాటు కార్పొరేట్ ట్యాక్స్‌ను కూడా చెల్లిస్తున్నాయి. ఇప్పుడు 15 శాతం (20.36 శాతం ప్రభావిత పన్ను) డీడీటీని తొలగించడంతో పాటుగా.. కార్పొరేట్ ట్యాక్స్‌ను కూడా తగ్గించారు. గతేడాదిలో కూడా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధిస్తున్నది మన దేశంలోనే అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులలో ఈ కింది ఆరు మల్టీ నేషనల్ కంపెనీల షేర్‌లు దీర్ఘకాలంలో చక్కని లాభాలు అందిస్తాయని మార్కెట్ ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');