ఐటీసీకి సిగరెట్ రేట్ల పెంపు సపోర్ట్

ఐటీసీకి సిగరెట్ రేట్ల పెంపు సపోర్ట్

లెంగ్త్ వేరియంట్ ప్రకారం సిగరెట్స్ రేట్లు పెంచుతూ ఐటీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. 10-12 శాతం మేర ధరలలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కూడా ఐటీసీ షేర్ లాభాలకు కారణంగా నిలుస్తోంది.

ఈ ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ ఆరంభం నుంచి ఐటీసీ కౌంటర్ రియాక్ట్ అవుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో సిగరెట్స్‌పై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. ధరలలో మార్పులు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐటీసీ షేర్ ధర 2.09 శాతం లాభంతో రూ. 215.00 వద్ద ట్రేడవుతోంది.