Kutumbarao View on Markets

Kutumbarao View on Markets

యూనియన్‌ బడ్జెట్‌తో నిరాశచెందిన మార్కెట్లలో గతవారం షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. కరోనా వైరస్‌ భయాలను తగ్గించడం, ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టతనివ్వడం దూశీయ సూచీల సెంటిమెంట్‌ను బలపరిచింది. అలాగే గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు రావడంతో బడ్జెట్‌ రోజు కనిష్ట స్థాయికి పడిపోయిన మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 1407 పాయింట్ల లాభంతో 41,142 వద్ద, నిఫ్టీ 437 పాయింట్ల లాభంతో 12098 వద్ద ఈవారం ట్రేడింగ్‌ను ముగించాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే(YTD) సెన్సెక్స్‌ 0.3శాతం, నిఫ్టీ 0.6శాతం నష్టంతో ట్రేడవుతున్నాయని మీరు గమనించాల్సిన అవసరముంది. ఇక బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 6.3శాతం, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 8.3శాతం లాభపడ్డాయి. ఓవరాల్‌ మార్కెట్‌ బ్రెడ్త్‌ చూస్తే శుక్రవారం రోజు సూచిల్లో అస్థిరత మూలంగా బెంచ్‌ మార్కెట్‌ సూచీలు బలహీనంగా ట్రేడయ్యాయి. 

దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డిఐఐలు) రూ.2,276.66 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.983.55 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. బ్యాంకుల డబ్బు ఖర్చును తగ్గించి, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్,  స్థూల, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వంటి ఒత్తిడితో కూడిన రంగాలకు రుణాలు ఇచ్చేలా వారిని ప్రోత్సహించేందుకు ఉద్దీపన ప్యాకేజీని విడుదల చేశారు. క్యూ 3 ఫలితాలు, దేశీయ స్థూల-ఆర్థిక డేటా, ఎఫ్ఐఐ మరియు డిఐఐ కార్యకలాపాలు, డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి కదలిక, ముడి చమురు ధరల కదలిక మరియు ప్రపంచ సూచనల మధ్య కరోనావైరన్‌పై వార్తల ప్రవాహం ద్వారా షార్ట్‌టర్మ్‌ ధోరణిని నియంత్రిస్తుంది. 

గతవారం యుఎస్ స్టాక్స్ నెల రోజుల్లోనే భారీ లాభాలను నమోదు చేశాయి. అంచనాలకు మించిన ఆర్థిక డేటాలు, చైనాలో వైరల్‌ వ్యాప్తితో ఆదేశ ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది.  ఏది ఏమయినప్పటికీ, కరోనావైరస్‌ సోకుతన్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో  ప్రపంచ పెట్టుబడిదారులను ఆందోళన మొదలైంది. 

వచ్చే వారం కీలక లెవల్స్‌..
రాబోయేవారంలో సెన్సెక్స్, నిఫ్టీలకు వరుసగా 40,500-41,900 మరియు 11,875-12,325 రేంజ్‌లో ట్రేడ్‌ కానున్నాయని ఛార్టిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లు, వచ్చేవారం వెలువడే ఆర్థిక డేటాలు, క్యూ-3 రిజల్ట్స్‌, రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు వచ్చేవారం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.