బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్.. ఎందుకు సెల్ చేయచ్చంటే!

బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్.. ఎందుకు సెల్ చేయచ్చంటే!

ఇండెక్స్.. బ్యాంక్ నిఫ్టీ
 

ప్రస్తుత ధర: 31,304
 

ఎంట్రీ లెవెల్: 31,400 - 31,700
 

టార్గెట్:  29,850
 

స్టాప్‌లాస్: 32,400
 

డౌన్‌సైడ్: 5 శాతం

 

తాజాగా బడ్జెట్‌కు ముందు మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ సమయంలో నిఫ్టీ బ్యాంక్ 29,600 పాయింట్ల వరకు దిగి వచ్చింది. 29,500 వద్ద హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్‌డౌన్ టార్గెట్ ఉండగా.. దీని సమీపానికి బ్యాంక్ నిఫ్టీ చేరుకుంది.

ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ తిరిగి 31,000 మార్క్‌ను అందుకుంది. గత కొన్ని నెలలుగా బెంచ్ మార్క్ ఇండెక్స్‌తో పోల్చితే.. నిఫ్టీ బ్యాంక్ అండర్‌పెర్ఫామ్ చేయడం పరిశీలిస్తే.. సూచీలో స్ట్రెంగ్త్ అంతగా కనిపించడం లేదు.

మొత్తంగా పరిశీలిస్తే, మీడియం-టెర్మ్‌కు వీక్లీ, మంత్లీ ఛార్టులలో బ్యాంక్ నిఫ్టీ బలహీనంగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా ఇలాంటి పరిస్థితులలో, తాజా పతనానికి 61.8 శాతం ఫిబొనాకి రీట్రేస్‌మెంట్‌ లెవెల్‌కు చేరువలో ఇండెక్స్ ఉంది.

ట్రేడర్లు 31,400 - 31,700 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ సెల్ చేయవచ్చని టెక్నికల్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు