కీలక వడ్డీరేట్లు యథాతథం

కీలక వడ్డీరేట్లు యథాతథం

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో 6-0 ఓట్లతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద రిలీఫ్‌ లభించనట్లయింది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతం, రివర్స్‌ రెపో 4.90 శాతం, బ్యాంక్‌ రేట్‌ 5.40 శాతం, సీఆర్‌ఆర్‌ 4 శాతం, ఎస్‌ఎల్‌ఆర్‌ 18.25 శాతంగా ఉన్నాయి. 

ఇక భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో వడ్డీరేట్లను తగ్గించే నిర్ణయాలు ఉంటాయని ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి జీడీపీ వృద్ధిరేటు 6శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');