మ్యూచువల్ ఫండ్స్‌పై టీడీఎస్: ఐటీ శాఖ ఏమంటోందంటే!

మ్యూచువల్ ఫండ్స్‌పై టీడీఎస్: ఐటీ శాఖ ఏమంటోందంటే!

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను తొలగించడం.. అలాగే వాటిని వ్యక్తిగత ఆదాయంలో చూపి పన్ను చెల్లించాలంటూ కొత్త విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన తెలిసిందే.

అయితే, ఈ అంశం విషయంలో లాభాలను మొత్తం చూపించాలా లేక కేవలం డివిడెండ్స్‌పై చెల్లిస్తే సరిపోతుందా అనే అంశంపై స్పష్టత లేదు. మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే మొత్తం లాభాలు అంటే క్యాపిటల్ గెయిన్స్‌ను కూడా ఆదాయంలో లెక్కించాలా అనే సందేహాలు తలెత్తాయి.

దీనితో ఆదాయపు పన్ను శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తాజా బడ్జెట్ ప్రకారం.. కేవలం డివిడెండ్‌లపై మాత్రమే 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుందని.. యూనిట్‌లను రిడీమ్ చేసుకోవడం ద్వారా లభించే కేపిటల్ గెయిన్స్‌పై కాదని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

వాటాదారులకు, యూనిట్ హోల్డర్లకు కంపెనీలు చెల్లించే డివిడెండ్‌పై విధించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్‌ను పూర్తిగా తొలగిస్తూ తాజా బడ్జెట్‌(2020-21)లో కేంద్రం ప్రకటించంది. 
కంపెనీలు మ్యూచువల్ ఫండ్‌ షేర్/యూనిట్ హోల్డర్లకు చెల్లించే డివిడెండ్/ఆదాయం... ఏడాదికి రూ. 5000 దాటితే.. డీడీటీ స్థానంలో డివిడెండ్/ఆదాయంపై 10 శాతం మూలం వద్ద పన్ను(టీడీఎస్)ను చెల్లించాలని తెలిపింది.

దీనిపై అస్పష్టత నెలకొనడంతో.. టీడీఎస్‌ను కేవలం డివిడెండ్ చెల్లింపులపై మాత్రమే విధించారని.. కేపిటల్ గెయిన్స్‌కు సంబంధం లేదంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టమైన ప్రకటన చేసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');