బాహుబలి సక్సెస్‌పై చాలా అనుమానాలు- శోభు యార్లగడ్డ

బాహుబలి సక్సెస్‌పై చాలా అనుమానాలు- శోభు యార్లగడ్డ


టాలీవుడ్ సినిమా హిస్టరీ తిరగరాసేసి.. మహోన్నత విజయం అందుకున్న మూవీ బాహుబలి. ఈ విజయం టాలీవుడ్‌కి గర్వకారణమే కాదు.. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కూడా. ఇంతటి విజయాన్ని ముందే ఊహించి.. నమ్మకం ఉంచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే.. మొదటగా చెప్పుకోవాల్సిన పేరు దర్శకుడు రాజమౌళి అయితే... రెండో వ్యక్తి నిర్మాత శోభు యార్లగడ్డ. ఓ విజన్ ని సాక్షాత్కారం చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చిన ఈ నిర్మాత.. అందుకు తగ్గ విజయాన్ని అందుకున్నారు. 

హైద్రాబాద్ లో జరిగిన స్టార్టప్ ఫెస్టివల్.. ఆగస్ట్ ఫెస్ట్ 2016లో పాల్గొన్న శోభు యార్లగడ్డ.. "ఫెయిల్యూర్ అంటే అనుకున్న స్థాయికి చేరలేకపోయామని మాత్రమే అర్ధం. ప్రయత్నం చేయలేదని కాదు కదా. మరింతగా ప్రయత్నించాలని చెప్పేదే పరాజయం' అంటూ స్ఫూర్తి రగిలించారు. బాహుబలి తీసే ముందు అనుకున్న స్థాయి కంటే చాలా ఎక్కువగా బడ్జెట్ పెరిగిపోయిందని.. ఆ సమయంలో విజయం సాధించగలమా.. పెట్టుబడి రాబట్టడం అసలు సాధ్యమవుతుందా అని చాలామంది అనుమానించారని చెప్పారాయన. అయితే.. తాము తీస్తున్న సినిమాను పూర్తిగా విశ్వసించడం విజయం  సాధించగలిగామని చెప్పారు. 

ఇక చివరగా బాహుబలి ది కంక్లూజన్ చిత్రం కోసం.. తన కష్టం చాలా తక్కువ అని.. ఇంకా చెప్పాలంటే తనదేమీ లేదన్న శోభు యార్లగడ్డ.. అందరి కంటే ఎక్కువగా రాజమౌళి కష్టపడుతున్నాడని అన్నారు.Most Popular