లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

లాభాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. ఇవాళ మన మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. కొరోనా వైరస్‌పై ఆందోళన చెందనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. మరోవైపు ఆసియా మార్కెట్లను కొరోనా వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. వైరస్ ప్రభావంతో చైనాలో 25, ప్రపంచవ్యాప్తంగా 800 మంది మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి.

మన మార్కెట్లలో షార్ట్ కవరింగ్ కనిపిస్తోందని ఎనలిస్ట్‌లు చెబుతన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 41555 పాయింట్ల వద్ద ఉండగా.. 55 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12235 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్ 269 పాయింట్ల లాభంతో 31273 వద్ద నిలిచింది.

ఐటీ, టెక్నాలజీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుండగా.. క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా ఉంది. 

ప్రస్తుతం నిఫ్టీలో యస్ బ్యాంక్, యూపీఎల్, ఇండియన్ ఆయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలవగా.. పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతి ఇన్‌ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్ షేర్లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');