నష్టాలకు బ్రేక్, సెన్సెక్స్-నిఫ్టీ లాభాల ముగింపు

నష్టాలకు బ్రేక్, సెన్సెక్స్-నిఫ్టీ లాభాల ముగింపు

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ, ఇవాళ బెంచ్‌మార్క్ సూచీలు లాభాలను ఆర్జించాయి. ట్రేడింగ్ ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు.. ఆ తర్వాత క్రమంగా అమ్మకాల ఒత్తిడితో క్షీణించాయి. మిడ్ సెషన్ సమయంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టి.. చివరకు రోజు గరిష్టానికి చేరువలో క్లోజింగ్ ముగించుకున్నాయి.

ఇవాల్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 41386 వద్ద ముగియగా.. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12180 వద్ద క్లోజయింది. ఒక శాతం మేర పుంజుకున్న బ్యాంక్ నిఫ్టీ 31004 వద్ద ముగిసింది.

ఇవాల్టి ట్రేడింగ్‌లో అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ముగియగా.. క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్ఈ రంగాలు భారీగా లాభపడ్డాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు కూడా ఒక శాతం మేర లాభపడడం విశేషం.

నిఫ్టీలో యస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, గెయిల్, బీపీసీఎల్, ఎల్ అండ్ టీ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. జీ ఎంటర్టెయిన్మెంట్, యూపీఎల్, సిప్లా, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');