షార్ట్ టెర్మ్ కోసం ఈ 3 స్టాక్స్ భలే అట్రాక్టివ్!

షార్ట్ టెర్మ్ కోసం ఈ 3 స్టాక్స్ భలే అట్రాక్టివ్!

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న మిశ్రమ సంకేతాలకు తోడు.. పలు కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో ఈ వారం మార్కెట్లు అంత ప్రోత్సాహకరంగా లేవు.
భారీ ర్యాలీ చేసిన తర్వాత వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్లు నష్టాలకు గురి కావడం గమనించాలి.
గరిష్ట స్థాయిల నుంచి.. ఇప్పటివరకూ ఈ వారంలో నిఫ్టీ 2 శాతం మేర దిగి వచ్చింది. వీక్లీ ఛార్టులను పరిశీలిస్తే.. నిఫ్టీ సూచీలో బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ సూచిస్తోంది. మళ్లీ మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి ప్రవేశించాలంటే.. నిఫ్టీ 200
పాయింట్లకు పైగా లాభాలను గడించాల్సి ఉంటుంది.
ఇలాంటి సమయంలో రాబోయే 3-4 వారాలకు ఈ మూడు స్టాక్స్‌ను ట్రేడింగ్ బెట్స్‌గా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు:

రాంకో సిమెంట్స్ | Buy | ఫ్రస్తుత ధర: Rs 830 | టార్గెట్:  Rs 890 | స్టాప్‌లాస్: Rs 797 | లాభాలకు అవకాశం: 7%
సుదీర్ఘ కాలం కన్సాలిడేషన్ జరిగిన తరువాత బ్రేకవుట్ చేసిన ఈ స్టాక్.. డైలీ ఛార్టులలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నమోదు చేసింది.
హారిజాంటల్ ట్రెండ్ లైన్‌ను బ్రేకవుట్ చేసిన తరువాత.. గత కొన్ని రోజులుగా కన్సాలిడేట్ అయిన ఈ స్టాక్.. స్వల్ప కాలంలో లాభాలు గడించవచ్చు.

 

క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ | Buy | ఫ్రస్తుత ధర: Rs 795 | టార్గెట్:  Rs 890 | స్టాప్‌లాస్: Rs 736 | లాభాలకు అవకాశం: 12%
వీక్లీ ఛార్టుల ప్రకారం హైయర్ హై, హైయర్ లో ఫార్మేషన్ సూచిస్తున్న క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్‌లో.. స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటమ్ వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ బ్రేకవుట్ సాధిస్తే.. స్వల్ప కాలంలో చక్కని లాభాలను ఈ స్టాక్ అందించవచ్చు.

 

 

బజాజ్ ఫిన్‌సర్వ్ | Sell | ఫ్రస్తుత ధర: Rs 9,545 | టార్గెట్:  Rs 9,100 | స్టాప్‌లాస్: Rs 9,800 | లాభాలకు అవకాశం: 5%
డైలీ ఛార్చులలో బేరిష్ సంకేతం అయిన AB = CD హార్మోనిక్ ప్యాటర్న్‌ను బజాజ్ ఫిన్‌సర్వ్ సూచిస్తోంది.
మూమెంటమ్ ఆసిలేటర్ ఆర్ఎస్ఐ (14) లోయర్ హై ఫార్మేషన్ సూచిస్తుండడం.. ఈ స్టాక్‌లో మరింత కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని తెలుపుతోంది

డిస్‌క్లెయిమర్: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన స్టాక్స్‌ను రికమెండేషన్స్‌గా పరిగణించరాదు. ఈ ఆర్టికల్‌ను బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్ ఎనలిస్ట్ రాసిన వ్యాసం నుంచి తీసుకోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');