అద్భుత ఫలితాలతో రేమండ్ 5 శాతం అప్

అద్భుత ఫలితాలతో రేమండ్ 5 శాతం అప్

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో.. ఇవాళ రేమండ్ కౌంటర్‌లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 196.8 కోట్ల నికర లాభం గడించినట్లు కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ లాభాలు రూ. 40 కోట్లుగా ఉన్నాయి.
అలాగే ఆదాయం కూడా 12.5 శాతం పెరిగి రూ. 1675 కోట్ల నుంచి రూ. 1885 కోట్లకు చేరుకుంది.
ఎబిటా 33.4 శాతం పెరిగి రూ. 206 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ 170 బేసిస్ పాయింట్లు పెరిగింది.

ఒక దశలో 5 శాతం పైగా లాభంతో రూ. 705 వరకు చేరుకున్న రేమండ్ షేర్.. ప్రస్తుతం 1.75 శాతం లాభంతో రూ. 685.00 వద్ద ట్రేడవుతోందిtv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');